Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. `ఆచార్య` సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు?
Acharya Movie Update: మెగా అభిమానులకు గుడ్ న్యూస్! మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఆచార్య`. ఏప్రిల్ 29న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ క్రమంలో ఆచార్య మూవీ గురించి ఓ హాట్ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Acharya Movie Update: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం షురూ చేయగా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ నడుస్తోంది.
'ఆచార్య' మూవీలో మహేష్ బాబు ఉన్నాడని చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యక్షంగా లేకపోయినా.. చిత్రబృందంతో పాలుపంచుకోనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు. ఏదేమైనా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించిన నేపథ్యంలో 'ఆచార్య' మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగం కానున్నారన్న వార్తతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డే నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
Also Read: KGF 2 Collection: రాజమౌళిని వెనక్కినెట్టిన ప్రశాంత్ నీల్? ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టిన KGF 2!
Also Read: Movies Releasing This Week: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.