Acharya Trailer: మాస్ కా బాప్ మెగాస్టార్.. చిరు`తనయుడు`.. అదరహో..!
Acharya Trailer: ఆచార్య మూవీ ట్రైలర్ అనుకున్న సమయం కన్నా ముందుగానే విడుదలైంది. చిరంజీవి, రామ్ చరణ్‌ల మాస్ డైలాగ్స్, పవర్ ఫుల్ ఫైట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మూవీలో ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి.
Acharya Trailer: మెగా స్టార్ చిరంజీవీ ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య మూవీ ట్రైలర్ విడుదలైంది.
'దివ్య వనమొకవైపు.. తీర్థ జలమొకవైపు.. నడుమ పాతఘట్టం' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అంతా సౌమ్యులు అంతా పూజలు చేసుకుంటూ కష్టాలు వస్తే.. అమ్మొరుపై భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటామేమో అని పొరపడి ఉండొచ్చు.. ఆపదొస్తే ఆ అమ్మొరే మాలో ఆవహించి ముందుకు పంపుతది. ధర్మ స్థలి అధర్మ స్థలి ఎలా అవుతుంది. అంటూ తమ ఊరు గురించి రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది.
పాత ఘట్టం వాళ్ల గుండెల మీద కాలు వేస్తే.. వాళ్ల కాలు తీసేయాలంట.. కాకపోతే అది ఏ కాలా అని' అనే డైలాగ్‌తో తో మెగాస్టార్ ఎంట్రీ అదిరించి. మూవీలో ఫైట్స్‌కు ఫైట్స్ ఓ లెవల్లో ఉన్నాయని ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. దీనితో పాటు సోనూ సూద్‌తో చిరంజీవి చెప్పే మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక ట్రైలర్ చూస్తే పాతఘట్టం అనే గ్రామం గురించి.. అటు రామ్ చరణ్, ఇటు చిరంజీవి నిత్యం పోరాటం చేస్తుంటారని అర్థమవుతుంది. మైనింగ్ నేపథ్యంలో సాగుతుందనేది తెలిసిందే.
ఆచార్య సినిమా గురించి..
ఈ మూవీలో చిరంజీవి, రామ్ చరణ్‌లతో పాటు.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. అయితే ట్రైలర్లో వాళ్లకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పథాకాలు సంయుక్తంగా నిర్మించాయి. నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి మణి శర్మ సంగీతమందించారు.
Also read: Rakul Preet Photos: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైజ్ జీరో సుందరి!
Also read: Mouni Roy Photos: కంటి చూపుతోనే కుర్రకారు మనసును డిస్టర్బ్ చేసే 'నాగిని' బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook