Acharya vs Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంతకం చేసిన తర్వాత మరో ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. అలా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ నెల 27వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరిగే సమయంలో కూడా ఆయన పనితీరును గమనించిన చాలామంది దేవర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తానేంటో నిరూపించాలనే తపన కనపడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 


నిజానికి కొరటాల శివ ఆచార్య సినిమా కంటే ముందే శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను ఇలా చాలా సినిమాలను తెరకెక్కించారు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఒక్క ఆచార్య సినిమాతో అన్ని సంవత్సరాలు ఆయన పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఈ సినిమా ఎవరి వల్ల డిజాస్టర్ అయ్యింది అనే విషయం పక్కన పెడితే చాలామంది డైరెక్టర్ కొరటాల శివ ను నిందించారు. అందుకే ఎలాగైనా సరే దేవర సినిమాతో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ. 


ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  విడుదల చేయగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. మొదటి నుంచి కొరటాల శివ తో మొదలైన నా ప్రయాణం లో ఇప్పటికీ ఆయన పై గౌరవం పెరిగిందే కానీ కొంచెం కూడా  తగ్గలేదు. తన మైండ్ ను సరిగా ఉపయోగించే వ్యక్తి ఆయనే. సరైన సమయం, సరైన మనుషులు పక్కన ఉంటే కచ్చితంగా అద్భుతమైన సినిమాలను అందిస్తాడు అంటూ తెలిపాడు ఎన్టీఆర్.


 దీంతో ఎన్టీఆర్ మాటల కారణంగా వివాదం రాజుకుంది. ఆచార్య సినిమా తీసినప్పుడు కొరటాల శివ పక్కన సరైన మనుషులు లేరా ..? అది సరైన సమయం కాదా? అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. 


దేవర సినిమా చేసే సమయంలో అందరూ కూడా కొరటాల శివకు మద్దతు ఇచ్చారు. అది బాలేదు ఇది బాలేదు అంటూ దర్శకుడు పై ఒత్తిడి చేయలేదు. ఆచార్య సమయంలో ఎందుకు డైరెక్టర్ పై ఒత్తిడి చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీంతో చిరంజీవి గొప్పా.? జూనియర్ ఎన్టీఆర్ గొప్ప..? అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఎన్టీఆర్ వర్సెస్ చిరంజీవి అంటూ అభిమానుల మధ్య గొడవలు పీక్స్ కి చేరిపోయాయి. మరి దేవరా సినిమా కొంప ముంచేటట్టు కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix


Also Read: Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.