Brahmaji Counter to Minister Roja: కొద్దిరోజుల క్రితం మంత్రి రోజా మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న రోజాని డైమండ్ రాణి అని సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంతో ఈ అంశం మీద వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్స్ వచ్చాయి. వైసీపీ మంత్రులంతా వరుసగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి మరీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇదే క్రమంలో యువశక్తి సభలో హైపర్ ఆది కూడా పాల్గొని ప్రభుత్వం మీద విమర్శలు వర్షం కురిపించాడు. తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రాసలతో కూడిన డైలాగులతో జనసైనికులను అలరించే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే విషయాన్ని మంత్రి రోజా దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించి హైపర్ ఆది లాంటి వారు మీకు గతంలో చాలా క్లోజ్ గా ఉండేవారు.  అలాంటి వారే మిమ్మల్ని తిడుతుంటే మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నిస్తే అసలు వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ఆమె కామెంట్ చేశారు.


వాళ్లంతా చిన్న వాళ్ళని వాళ్ళ వెనుక నుండి ఎవరు మాట్లాడించారో మనం ఆలోచించాలని చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీలో ఆరేడుగురు హీరోలు ఉన్నారు కాబట్టి మీకు సినిమా అవకాశాలు రావు అని భయపెట్టి వాళ్ళ చేత మాట్లాడించి ఉండవచ్చని రోజా కామెంట్స్ చేయడంతో తాజాగా ఇదే విషయం మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఆసక్తికరంగా రోజాకి కౌంటర్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు, అయినా చిన్న ఆర్టిస్టులే కదా అంత భయపడతారు ఎందుకు అంటూ రోజాకు కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


వాస్తవానికి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా మంత్రిగా ఎన్నికయ్యే ముందు వరకు నాగబాబుతో కలిసి జబర్దస్త్ అని షో చేసేవారు. నాగబాబు జబర్దస్త్ యాజమాన్యంతో గొడవలు రావడంతో తప్పుకున్నా సరే రోజా మాత్రం ఆ షో వదలకుండా చేస్తూ వచ్చారు. మంత్రి అయ్యే ముందు ఇక మీదట కూడా ఈ షో చేస్తూ ఉంటే పొలిటికల్ గా ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఆమె షో నుంచి తప్పుకున్నారు. అప్పటివరకు తనతో బాగానే ఉన్న హైపర్ ఆది లాంటి వాళ్ళు ఇలా పొలిటికల్ స్టేజి మీదకు వచ్చి తన మీద విమర్శల వర్షం కురిపిస్తుంటే ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు బ్రహ్మాజీకి ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తారేమో వేచి చూడాలి మరి.
Also Read: Vijay Antony Critical Stage: తీవ్ర విషమంగా విజయ్ అంటోనీ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమంటున్నారంటే?


Also Read: Nithya Menon as Teacher: స్కూల్ పిల్లలకు టీచర్ గా మారిన నిత్యా మీనన్.. ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook