Actor Chandan Kumar: తొందరపాటుకు తప్పదు మూల్యం.. సీరియల్స్ నుంచి లైఫ్ టైం బ్యాన్
Actor Chandan Kumar Banned From Telugu Serials: తెలుగు సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ మీద దాడికి దిగిన కన్నడ సీరియల్ నటుడు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తెలుగు టీవీ ఫెడరేషన్ ఆయన మీద సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Actor Chandan Kumar Banned From Telugu Serials: కన్నడ రాష్ట్రానికి చెందిన ఒక సీరియల్ నటుడి మీద హైదరాబాద్లో దాడి జరగడం కలకలం రేగింది. కన్నడ సీరియల్స్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చందన్‌కుమార్ అనే వ్యక్తి తెలుగులో కూడా శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ లో లీడ్ రోల్ లో నటించేందుకు ఎంపిక చేసుకున్నారు. అయితే జూలై 31వ తేదీన ఆయన హైదరాబాద్ లో షూటింగ్ కి హాజరయ్యారు. అయితే ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలోనే తన తల్లిని హాస్పిటల్ లో చేర్చి షూటింగ్ కి హాజరయ్యారట.
షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో తాను కాసేపు పడుకుంటానని అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పి వెళ్లి పడుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. సిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఐదు నిమిషాలు అని చెప్పి అరగంట పడుకున్నారేంటి అని గట్టిగా అరవడంతో తనకు కోపం వచ్చి కొంచెం వెనక్కి నెట్టానని దానికే తాను దాడి చేసినట్లు వెళ్లి డైరెక్టర్ కు చెప్పడంతో వాళ్ళంతా తనను ఒంటరిని చేసి సారీ చెప్పినచడమే కాక తన మీద దాడి చేశారని అతను బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాక తనను కన్నడ నటుడు అనే పేరుతో తక్కువ చేసి మాట్లాడారు అంటూ తెలుగు టీవీ పరిశ్రమ గురించి ఆయన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశమైన తెలుగు టీవీ ఫెడరేషన్ సభ్యులు ఆయన మీద శాశ్వతంగా బహిష్కరణ వేటు వేశారు. ఆయన ఇక మీదట తెలుగు సీరియల్స్ లో నటించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై జీవితకాల నిషేధం విధిస్తున్నామని, తెలుగు సీరియల్స్ నుంచి ఇప్పటికిపుడు తొలగిస్తున్నామని ఫెడరేషన్ మంగళవారం ప్రకటించింది. ఇక ఈ అంశంలో జరిగింది ఒకటి అయితే చందన్ దాన్ని మార్చి అసత్య ప్రచారం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపించింది.
240 మంది కన్నడ నటులు తెలుగు సీరియల్స్ లో నటిస్తుండగా ఎప్పుడూ ఎలాంటి విభేదాలు రాలేదనీ, కానీ చందన్ ఒక్కసారిగా అందరి మధ్య విభేదాలు ఏర్పడేలా చేశాడని వెల్లడించారు. ఇక నిజానికి ముందుగా అసలు కన్నడ నటీనటులు ఎవరూ తెలుగు సీరియల్స్ లో నటించకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కరు చేసిన పనికి అందర్నీ బాధ్యులు చేయడం కరెక్ట్ కాదని మళ్లీ వెనక్కి తగ్గారు. అంతేకాక ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో సగానికి పైగా కన్నడ నటీనటులే ఉన్నారు. వారందరినీ తప్పిస్తే ప్రస్తుతం ఉన్న సీరియల్స్ నిర్మాతలు అందరూ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!
Also Read: SitaRamam: తెలుగులో హీరోలు లేరా.. దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook