Dhanaraj about Ram: జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ధనాధన్ ధనరాజ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే ఈయన, అదే జోష్ తో సినిమాలలో అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి , మెప్పించిన ధనరాజ్ హీరోగా కూడా నటించి తన కోరికను తీర్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇదిలా ఉండగా ధనరాజ్ సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా హీరో రామ్ అలాగే డైరెక్టర్ సుకుమార్ అంటే ఎనలేని అభిమానమని,  ఈ ఇద్దరి పేర్లు కలిసేలా తన కొడుకుకు సుక్రామ్ అని పేరు పెట్టానని తెలిపారు. ఇకపోతే ఈ పేరు వెనుక వీరిద్దరి పేర్లు కలిపి పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనరాజ్ వెల్లడించారు. 



ధనరాజ్ మాట్లాడుతూ.. ‘ఒకానొక సమయంలో నా భార్య ప్రెగ్నెంట్.. నాకు దగ్గర అప్పుడు డబ్బులు లేవు. ఆ సమయంలో నాకు పదివేల రూపాయలు అవసరమైంది. అప్పట్లో రూ .10,000 అంటే నా దృష్టిలో  10 లక్షల రూపాయలతో సమానం. దీంతో వెంటనే రామ్ ని అడిగాను. ఆయన వెంటనే  పదివేల రూపాయల చెక్కు ఇచ్చారు. అకౌంట్ నెంబర్ లేదు అంటే.. అప్పుడు ఆయన వాళ్ళ డ్రైవర్ కి ఇచ్చి పంపించి, సెల్ఫ్ అని చెప్పి తీయించి, పదివేల రూపాయలు నాకు ఇచ్చారు. అంతేకాదు అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే సిగ్గు లేకుండా.. నన్ను అడుగు అంటూ రామ్ చెప్పారు’ అంటూ తెలిపారు ధనరాజ్. 


"అంతేకాదు ఇలాంటి సాన్నిహిత్యం  సుకుమార్ తో వుంది. ఆయన ఏంటంటే ఆయన జేబులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు వెంటనే తీసేసి, అవును పిల్లలు ఉన్నారు కదా.. ఇదిగో తీసుకో నీ కూతురికి పట్టీలు కొను  ఈ డబ్బులతో అంటూ తీసి ఇచ్చేసేవారు. ఓకేనా సరిపోతాయా అని అడిగేవారు.  నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా  నేను వారికి అవసరమేమీ కాదు. వాళ్లకు నన్ను పాంపరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.నాకు బాబు పుట్టిన తర్వాత.. నా భార్య వాళ్ళ పేరు పెడదామన్నారు. 21 రోజుల తర్వాత అనుకుంటే నేను డిసైడ్ అయ్యాను. నా కొడుకుకి సుకుమార్, రామ్ పేర్లు కలిసి వచ్చేలా పెట్టాలనుకున్నాను. అలా నా కొడుకుకు సుక్రామ్ అని పేరు పెట్టాను," అంటూ తెలిపారు.   మొత్తానికైతే తన కొడుకు పేరు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.


Also Read: Tirumala Laddu Row: సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ, చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్‌ షర్మిల


Also Read: APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.