Actor Nani Konda Surekha: సినీ నటీనటుల వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టేసిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విచక్షణ లేకుండా ఓ మహిళా నటి జీవితానికి సంబంధించిన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన సురేఖపై సినీ పరిశ్రమ ఘాటుగా స్పందిస్తోంది. హీరో నాని అయితే రెచ్చిపోయారు. ఆమె వ్యాఖ్యలను ఖండఖండాలుగా ఖండించారు. బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా సంచలన పోస్టు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌


ఏది మాట్లాడినా.. ఏ చెత్త వ్యాఖ్యలు మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయాల నాయకులు భావించడం జీర్ణించుకోలేని విషయం. ఎప్పుడైతే బాధ్యత లేని వ్యాఖ్యలు చేశారో అప్పుడే మీరు ప్రజలకు బాధ్యత వహించలేని వారవుతారు. ఇది ఒక్క సినీ నటులు, సినిమానే కాదు. ఇది ఏ రాజకీయ పార్టీనే కాదు. ఇలాంటి నిరాధారమైన.. తప్పుడు.. జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. సమాజం మొత్తం ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఇది. సమాజంపై తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అంశాన్ని ఖండించాల్సిందే' అంటూ నాని ట్వీట్‌ చేశారు.

Also Read: KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్‌ వార్నింగ్‌


రాజీనామాకు డిమాండ్
సినీ నటుల విడాకుల అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం తొలిసారి. నానికే కోపాన్ని తెప్పించాయంటే ఆమె చేసిన వ్యాఖ్యల ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే అన్ని రంగాల ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ వివాదం గురువారం మరింత తారస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఫిల్మ్‌ చాంబర్‌ కూడా స్పందించనుంది. మంత్రి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్‌ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.