కరోనా వైరస్‌ (Coronavirus) జన జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. అన్ని రంగాల వారికి కోవిడ్19 వైరస్ చుక్కలు చూపిస్తోంది. దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించాయంటే కరోనావైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు మానసికంగా సిద్ధమయ్యారు, కానీ అందరిదీ ఒకటే ఆందోళన. ఇంట్లో కూర్చుంటే తిండికి, రోజువారీ ఖర్చులకు డబ్బులెలా వస్తాయి మరి.  హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో తన వద్ద పనిచేసే సిబ్బందికి మే నెల వరకు అంటే మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించానని ప్రకాష్‌రాజ్‌ వెల్లడించారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించిన తన మనసులో ఎన్నో ఆలోచనలు కదలాడాయని, దీంతో బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.  ఆంటీ అని పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్


ఫార్మ్‌హౌస్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, ఇల్లు, తన ఫౌండేషన్‌లో పనిచేసేవారితో పాటు వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు ముందుగానే చెల్లించాను. కరోనా నేపథ్యంలో వీరు ఇబ్బంది పడకూదని ఆలోచించి.. తన వద్ద పనిచేసే అందరికీ మే నెల వరకు జీతాలు అందించి తనకు తోచింది చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అందరూ తమకు తోచినరీతిలో ఇతకులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. తన శక్తిమేర ఇంకా సాయం చేస్తానని, కష్టకాలంలోనే ఇతరులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


బుల్లితెర భామ టాప్ Bikini Photos 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone