Saranga Dariya Movie Success Meet: రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం.. ఈ 12న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. సారంగదరియా సినిమా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. టెక్నికల్ టీం చాలా కష్టపడిందన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే తనకు హ్యాపియెస్ట్ మూమెంట్ అని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: iQOO Z9 Lite 5G: వెరీ ఛీప్‌ ధరకే iQOO Z9 Lite 5G మొబైల్‌ లాంచ్‌.. ఆఫర్స్‌తో భారీ తగ్గింపు..


శరత్ మాట్లాడుతూ.. సారంగదరియా సినిమా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోందని తెలిపారు. మొదటి రోజు తక్కువ మంది చూశారని.. మౌత్ టాక్‌తో మెల్లగా కలెక్షన్స్ పెరుగుతున్నాయన్నారు. ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని.. తమ దర్శకుడు ఒక్క కథలోనే మూడు కథలు చక్కగా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ఇంత మంచి సక్సెస్‌ను అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పారు. డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. సారంగదరియా సినిమాకు మంచ రెస్పాన్స్ వస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను సినిమా మీద ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని.. తాను చెప్పిన కథను రాజా సార్ వెంటనే ఓకే అన్నారని తెలిపారు. తనను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు నిర్మాత శరత్‌కు థ్యాంక్స్ చెప్పారు.


సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత మహేష్ . కలెక్షన్లు పెరుగుతున్నాయని.. హౌస్ ఫుల్‌ అవుతున్నాయన్నారు. ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్ చెప్పారు. ఆదిత్య మ్యూజిన్ నిరంజన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రాజా రవీంద్ర అద్భుతంగా నటించారని అన్నారు. డెబ్యూ దర్శకుడిని నమ్మి ఆయన సాహసం చేశారని.. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇతర నటీనటులు మాట్లాడుతూ.. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన.. అన్ని పాత్రలకు జనాల నుంచి మంచి ఆదరణ దక్కుతోందన్నారు. అందరం కలిసి పని చేయడం వల్లే ఈ సక్సెస్ వచ్చిందని చెప్పారు.  


Also Read: Big Breaking.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ తమ్ముడు.. పలువురు ప్రముఖులు కూడా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి