Ramesh Babu last rites: ముగిసిన రమేష్ బాబు అంత్యక్రియలు.. కన్నీటిపర్యంతమైన కృష్ణ..
Ramesh Babu last rites: నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.
Ramesh Babu last rites: నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు జయకృష్ణ తండ్రి చితికి నిప్పంటించారు. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు, రమేష్ బాబు మృతదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరా దేవి కుమారుడి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు. ఇద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. కరోనా సోకి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.
రమేష్ బాబు మృతి పట్ల చిరంజీవి సహా పలు సినీ ప్రముఖులు సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం (జనవరి 8) రాత్రి కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతి సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
రమేష్ బాబు 1974లో 'అల్లూరి సీతారామ రాజు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సోలో హీరోగా (Ramesh Babu) దాదాపు 15 చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో నటన నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారి హిందీలో అమితాబ్ బచ్చన్‌తో 'సూర్యవంశం', తెలుగులో మహేష్ బాబుతో 'అర్జున్', 'అతిథి' తదితర చిత్రాలు నిర్మించారు.
Also Read: Ramesh Babu: రమేష్ బాబు నటనకు ఎందుకు దూరమయ్యారు.. హీరోగా ఎందుకు విఫలమయ్యారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి