Kantara Project Update:  2022లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సినిమా కాంతార. ఈ సినిమా ఫ్రీక్వెల్ తెరకెక్కనున్న మూవీ కాంతార-2. రిషబ్ శెట్టి హీరోగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబరు నుంచి మెుదలుకానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ రిషభ్ శెట్టి ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కలరీ పట్టులో శిక్షణ తీసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్ర మెుదటి భాగాన్ని తక్కువ ఖర్చుతో నిర్మించిన మేకర్స్.. రెండో భాగాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. అయితే ఇందులో ఇందులో దేవత యెుక్క నేపథ్యాన్ని (Bhoota Kola festival) మరింత లోతుగా చూపించనున్నారు. ప్రకృతి నేపథ్యంలో తెరకెక్కిన తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ప్రీక్వెల్ లో చూపించనున్నారు. 


Also Read: Project-K Movie update: ప్రభాస్ ‘'ప్రాజెక్ట్ కే'’ మోషన్ పోస్టర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?


గతేడాది సెప్టెంబరులో కన్నడలో రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో.. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు.  ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సక్సెస్ అయింది. అంతేకాకుండా ఊహించని వసూళ్లను సాధించింది. ఈ సినిమా కలెక్షన్లతోపాటు పలు అవార్డులను కూడా సాధించింది. మన దేశం తరపను ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రాల్లో ఇది ఒకటి. 


Also Read: Leo First Look Controversy: దొరికేసిన లోకేష్ కనగరాజ్.. లియో ఫస్ట్ లుక్ ఆ సినిమా పోస్టర్ కు కాపీనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook