Sameer About Nandamuri Balakrishna సీనియర్ నటుడు సమీర్‌ అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీతో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. చిరంజీవితోనూ, బాలయ్యతోనూ సినిమాలు చేశాడు. ఆ ఇద్దరితోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. క్లోజ్‌గా పర్సనల్‌గా మాట్లాడేంత చనువు ఉన్న సమీర్ తాజాగా బాలయ్య గురించి ఓ విషయాన్ని చెప్పాడు. తనను ఓసారి డోర్ తీసి తోసేశాడంటూ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు సమీర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమీర్, గిరి, హేమ ఇలా సీనియర్లంతా కూడా సుమ అడ్డా షోకు గెస్టులుగా వచ్చారు. సుమ షో అంటే సమీర్‌ కచ్చితంగా నాలుగైదు సార్లైనా కూడా షోకు గెస్టుగా వస్తాడు. క్యాష్ షోలో అయితే సమీర్ ఎన్నో సార్లు గెస్టుగా వచ్చాడు. రాజీవ్ కనకాల, సమీర్ ఇలా అందరూ కూడా ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.


తాజాగా సమీర్ ఈ ప్రోమోలో దుమ్ములేపేశాడు. అన్నయ్య సినిమాను స్పూఫ్‌ చేసేందుకు సమీర్ ప్రయత్నించాడు. చిరంజీవి మ్యానరిజం, డైలాగ్స్‌తో రెచ్చిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ మీరేంటి నాగార్జున గారిలా మాట్లాడుతున్నారు అని సమీర్ గాలి తీసేసింది సుమ.


 



ఇలా ఈ ప్రోమో ఆసాంతం సుమ పంచ్‌లు వేస్తూనే ఉంది. ఇక హేమ దెబ్బకు గిరి అయితే భయపడిపోయాడు. తాను అందంగా లేనని ఆడియెన్స్ అంటే సైతం వారికి మీదకు వెళ్లింది హేమ. ఇక హేమ స్పీడును చూసి గిరి బాగానే బెదిరిపోయాడు. ప్రోమో చివర్లో బాలయ్య మీద సమీర్ కామెంట్లు చేశాడు.


ప్రమోషన్ ఈవెంట్లో బాలయ్య గారితో ఓ సంఘటన జరిగిందట కదా? అని సుమ అడిగేసింది. అంత దూరంలో థియేటర్ ఉంది.. గేట్‌కు తామున్న బస్‌కు చాలా దూరం ఉందని, బాబు మనం అక్కడికి ఎలా వెళ్తామని అడిగాను. చూస్తావా? ఎలా వెళ్తానో అని అనేసి.. డోర్ తీసేసి నన్ను తోసేశాడు అంటూ నాడు జరిగిన విషయం గురించి చెప్పేశాడు సమీర్.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook