Hero Srikanth corona: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొవిడ్ మూడో వేవ్ లో మునుపెన్నడి లేని భారీ కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ వైరస్ ధాటికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా.. ఇప్పుడు హీరో శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని హీరో శ్రీకాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ప్రియమైన స్నేహితులారా.. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. గత కొన్ని రోజులుగా తనను కలిసి వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి" అని హీరో శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా కోరారు. 



నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ' సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడా సినిమా ఓటీటీలోనూ విశేషాదరణ దక్కించుకుంటోంది. 


దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'జేమ్స్' చిత్రంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో సినిమాలోనూ నటించనున్నారు.  


Also Read: Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్


Also Read: Raviteja Birthday: మాస్ సామ్రాజ్యానికి మకుటం లేని రారాజు మన రవితేజ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook