Aakaasam Nee Haddhu Ra Official Trailer Released: సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) న‌టించిన త‌మిళ చిత్రం శూర‌రై పోట్రు (Soorarai Pottru) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' (Akasam Nee Haddura ) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ (Sudha Kongara Prasad) దర్శకత్వం వహిస్తుండగా.. గునీత్ మొంగాతో కలిసి తన సొంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్‌పై సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు (Mohan Babu) ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. Also read: Mohan Babu ‘సన్నాఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ కరోనా కారణంగా సినిమాను రిలీజ్ చేయలేదు. ఇటీవల అక్టోబర్‌ 30న ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్ .. మళ్లీ రిలీజ్ డేట్‌ను నవంబర్ 12కు మార్చింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో హీరో సూర్య, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. 



ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితకథను ఆధారంగా సినిమాను సుధా కొంగ ప్రసాద్ తెర‌కెక్కించారు. అతితక్కువ ధరలతో ప్రతీ వ్యక్తి విమాన ప్రయాణం చేసే విధంగా.. విమాన సంస్థను ప్రారంభించానుకున్న సామాన్య యువకుడు ఎలా కష్టాల పాలయ్యాడు అనే అంశంతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్‌లో సూర్య చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యవసాయం చేసేవాడు విమానం ఎక్కుతాడు.. టికెట్టు ధర ఒక్క రూపాయే.. అంటూ చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా నవంబర్ 12న ఓటీటీ వేదికగా విడుదల కానుంది. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe