Actress Anandhi Wedding: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. దిల్ రాజు నుంచి మొదలుకుని మొన్న కొణిదెల నిహారిక వరకు పలువురు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ వివాహం చేసుకున్నారు. అయితే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మ్యారేజ్ చేసుకోవడంతో అంతగా ఎవరికీ తెలియలేదు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బస్‌స్టాప్ సినిమా హీరోయిన్ కాయల్ ఆనంది గురువారం పెళ్లి పీటలెక్కారు. తమిళ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సోక్రటీస్‌, కాయల్ ఆనంది వివాహం ఆమె సొంతూరు వరంగల్(Warangal)‌లోని ఓ రెస్టారెంట్‌లో ఏ హంగూ ఆర్భాటం లేకుండా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో ఆనంది మెడలో వరుడు సోక్రటీస్ మూడు ముళ్లు వేశారు. 

Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్



ఆనంది టాలీవుడ్‌(Tollywood)తో పాటు కోలీవుడ్‌లో పలు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో బస్‌స్టాప్ సినిమాతో పరిచయమైంది. అంతకుముందు ఈరోజుల్లో మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె నటించిన జాంబి రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది.


Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్


 




కోలీవుడ్‌లో చేసిన తొలి మూవీ కాయల్‌. అప్పటినుంచి కాయల్ ఆనందిగా మారిపోయింది. సడన్‌గా వివాహం చేసుకుని తన అభిమానులకు షాకిచ్చింది. ప్రేమ వివాహం కావడం, అందులోనూ తమిళ సినిమాలకు కో-డైరెక్టర్ కావడంతో ఏ హడావుడి లేకుండా వివాహం చేసుకుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.


Also Read: నటుడు Sonu Sood‌పై ఫిర్యాదు చేసిన బీఎంసీ, కబ్జా ఆరోపణలు సైతం! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook