Charmi: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది హీరోయిన్ చార్మి(Charmi).. స్టార్ హీరోస్ అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏(Puri Jagannath)తో కలిసి పూరి కనెక్ట్స్(puri Connects) బ్యానర్ పై సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. హీరోయిన్‏గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే.. నటనకు స్వస్తి చెప్పి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది చార్మి.. తర్వాత.. పూర్తిగా నటనకు దూరంగా ఉండిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Nivetha Thomas: వకీల్ సాబ్ భామ సాహసం.. కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామస్..


తాజాగా తనకు నటించాలని లేదంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది చార్మి.. ఓ ఇంటర్వ్యూలో ఈ పంజాబీ బ్యూటీ మాట్లాడుతూ.. హీరోయిన్‏గా ఉండటంలోనే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఫిట్ నెస్ పై మాత్రమే దృష్టి పెడితే సరిపోతుంది. నిర్మాతగా బాధ్యతలను స్వీకరించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు.. అప్పుడు అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది. 


హీరోయిన్‏గా ఉన్నప్పుడు నా పని వరకూ నేను చూసుకుంటే సరిపోయేది.. కానీ నిర్మాతగా మారిన తర్వాత అలా కుదరదు.. అందరి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నాకు విసుగు రావట్లేదు.. నటిగా నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే ఆలోచన మాత్రం లేదు అని చెప్పుకొచ్చింది చార్మి.. ప్రస్తుతం చార్మి… విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ప్రధాన పాత్రలో నటిస్తున్న లైగర్(Liger Movie) చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook