Actor Divi Pantless Photo: ఒకప్పుడు తెలుగు సినిమాల్లోకి తెలుగు అమ్మాయిలు పెద్దగా వచ్చి రాణించే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో దివి వద్యా కూడా ఒకరు. సినిమాల్లోకి రాకముందే మోడలింగ్ చేస్తూ డబ్బులు వెనకేసుకున్న దివి వద్యా సినిమాల్లోకి వచ్చి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ చెప్పుకోదగ్గ పాత్ర ఒకటి కూడా దివి వద్యాకు దక్కలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహర్షి సినిమాలో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉన్న పాత్రలో నటించింది కానీ ఆమె ఎవరో అన్న స్పృహ కూడా ప్రేక్షకులకు కలగలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ ఎంట్రీ దొరికిందో అప్పుడు ఇంత అందమైన తెలుగు అమ్మాయిని ఇన్నాళ్లు మనం మిస్సయ్యమా అన్నట్టుగా టాలీవుడ్ ఫీల్ అయింది. ఆ బిగ్ బాస్ ఫినాలే రోజునే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో నటి నటించే అవకాశం ఇస్తానని ప్రకటించడంతో ఆమె దశ తిరిగిపోయింది అందరూ భావించారు. కానీ అంత ఈజీగా ఆమెకు స్టార్ డం అంత ఈజీగా దక్కడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ ప్రేమికురాలి పాత్రలో ఆమె నటించింది.



కానీ గాడ్ ఫాదర్ సినిమాకే అంత క్రేజ్ దక్కకపోవడంతో ఈమె పాత్రకు కూడా పెద్దగా పేరు రాలేదు. ఇక ఆ తర్వాత ఏటీఎం అనే ఒక వెబ్ సిరీస్ లో సన్నీ ప్రధాన పాత్రలో నటించగా ఈమె మరొక వ్యక్తి ప్రియురాలి పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చుకుంది కానీ దివి వద్యా పాత్రకు మాత్రం అంత ప్రశంసలేమీ దక్కలేదు. అయినా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్న ఈ భామ తాజాగా వంటగదిలో షెఫ్ కోటు వేసుకుని కింద మాత్రం ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా అన్నట్లుగా తొడలు చూపిస్తూ నిలబడి ఫోజు ఇచ్చింది.


ఇక ఆ ఫోటోకి సంథింగ్ ఇస్ బేకింగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. చేతికి గ్లౌజులు ఒక చేతిలో పదునైన కత్తితో కనిపిస్తున్న ఆమె కత్తిలా ఉందంటూ పోలవరం కామెంట్లు చేస్తుంటే ఒకరిద్దరు నెటిజన్లు మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా దివి అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు హాలీవుడ్ యాక్టర్ లా ఉన్నావంటే మరో నెటిజన్ మాత్రం మీ టాలెంట్ నీ ఈ టాలీవుడ్ యూజ్ చేసుకోవట్లేదు దివి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో మీద మీరు కూడా ఒక లుక్కేయండి.
Also Read: Ariyana Glory Photo: అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. దారుణమైన కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు!


Also Read: Jr. NTR into AP Politics: ఏపీ రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook