Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
Actress Ileana D`Cruz: `పోకిరి` బ్యూటీ ఇలియానా పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతోపాటు చిన్నారి ఫోటోను కూడా షేర్ చేసింది.
Actress Ileana D'Cruz welcomes baby boy: ప్రముఖ నటి ఇలియానా తల్లయ్యారు. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె(Actress Ileana D'Cruz) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చిన్నారికి 'కోవా ఫీనిక్స్ డోలన్'’(Koa Pheonix Dolan) అని పేరు పెట్టినట్లు ఇలియానా తెలిపారు. ''మా ప్రియమైన అబ్బాయికి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకడానికి ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం'' అని ఇలియానా ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఇలియానాకు విషెస్ చెబుతున్నారు.
గత రెండేళ్లుగా ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాను తల్లి కాబోతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించి షాక్ ఇచ్చింది ఇలియానా. అప్పటి నుంచి క్రమంగా బేబీ బంప్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది ఈ బ్యూటీ. కిందట నెల జూలైలో 'డేట్ నైట్' అనే క్యాప్షన్ తో ప్రియుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇలియానా అతడి పేరును మాత్రం బయటపెట్టలేదు.
ఇకపోతే ‘దేవదాస్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. పోకిరి, ఖతర్నాక్, రాఖీ, మున్నా, భలేదొంగలు, ఆట, కిక్, రెచ్చిపో, సలీమ్, శక్తి, నేను నా రాక్షసి, జులాయి, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చివరిసారిగా 2018లో రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ లో చేసింది. గత కొన్నేళ్లుగా ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తుంది.
Also Read: Bholaa Shankar: 'రేజ్ ఆఫ్ భోళా' ఆంథమ్ సాంగ్ వచ్చేసింది... బాస్ ఎలివేషన్ అదిరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook