Actress Jayasudha Clarity on Her 3rd Marriage: చాలా చిన్న వయసు అంటే 13 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. సహజ నటనతో సహజ నటిగా తెలుగు వారందరి దృష్టిలో నిలిచిపోయిన ఆమె 1972లో పండంటి కాపురం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఐదు దశాబ్దాల పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేజీలు లిఖించుకున్నారు జయసుధ. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేస్తున్నారు. తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఆమె అనేక సినిమాలు చేశారు. అయితే ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళిన జయ సుధ అక్కడ ఒక బిజినెస్ మాన్ ను సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు అంటూ అనేక వెబ్సైట్స్ లో వార్తలు పుట్టుకొచ్చాయి.


దానికి తోడు జయసుధ ఎక్కడికి వెళ్లినా సదరు వ్యక్తి వెంట వస్తూ ఉండడంతో ఆ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. అయితే అసలు విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇదంతా ప్రచారమే అని తేలింది. అసలు జయసుధకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని, అలాంటప్పుడు ఈ వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియదని అంటున్నారు. వాస్తవానికి వార్తలలో వచ్చినట్లు సదరు వ్యక్తి అమెరికాకి చెందిన వ్యక్తి అయినా ఆయన ఒక ఫిలిం మేకర్. జయసుధ బయోపిక్ తీయాలని ఆయన కోరడంతో దానికి జయసుధ అంగీకరించారని ఆయనే దర్శకత్వం వహిస్తూ నిర్మాణం వహిస్తున్న జయసుధ బయోపిక్ కోసమే ఆయన జయసుధతో కొన్నాళ్లు ట్రావెల్ చేయాలని కోరారని దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.


తెలుగు సినీ పరిశ్రమ సహా తమిళ సినీ పరిశ్రమలో జయసుధను ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ మీడియా ప్రతినిధుల వ్యవహారం ఎలా ఉంటుంది? ఇక్కడ షూటింగ్స్ ఎలా జరుగుతాయి? లాంటి విషయాలు పరిశీలించడానికి ఆమె పబ్లిక్ లో బయటకు వస్తున్నప్పుడు ఆయన కూడా జయసుధ వెంట పాటు వస్తున్నారని ఇలాంటి గ్లామర్ ఫీల్డ్ నుంచి ఆమె స్పిరిచువల్ వేలోకి ఎలా వెళ్లారు? అనే విషయాలను ఈ బయోపిక్ లో ప్రస్తావించ బోతున్నారు అని తెలిసింది. అలాగే ఈ బయోపిక్ కు జయసుధ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సో జయసుధ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టి పుకార్లు అన్నమాట. 
Also Read: Bala Murugan Passed Away: గౌతమీపుత్ర శాతకర్ణి రైటర్ ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?


Also Read: Anchor Rashmi Tweet: కోడి పందాల గురించి మాట్లాడితే చెప్పు తెగేలా కొడతారన్న నెటిజెన్..రష్మీ ఏమందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook