Karate kalyani: వీడియోలతో వేధిస్తున్నారు!: కరాటే కళ్యాణి
Karate kalyani: కొందరు తనకు నిత్యం అసభ్య సందేశాలు, అశ్లీల వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
తనను వేధింపులకు గురిచేస్తున్నారని సినీ నటి కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటే భయం వేస్తుందన్నారు. కొందరు వ్యక్తులు తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నారని, అంతటితో ఆగకుండా అశ్లీల వీడియోలు పంపుతున్నారని ఫిర్యాదు చేశారు. మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసినా వేధింపులు ఆగడం లేదని వాపోయారు. కొత్త నెంబర్ల నుంచి న్యూడ్ వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: బెడ్‌పై తన కమిట్మెంట్ చూపిస్తోన్న నటి.. మామూలు లేదుగా!
సామాజిక మాధ్యమాలలో సైతం మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేసి అశ్లీలతను ప్రదర్శిస్తోందని వేధిస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆవేదన చెందారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొన్ని రోజుల కిందట యూట్యూట్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కరాటే కళ్యాణి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే పనులు చేయకూడదని.. కావాలంటే ఇతర మతాల వారి పేర్లు పెట్టుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
Also Read: మతంపై షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫిదా
కాగా, సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృధ్వీరాజ్ ఓ మహిళా ఉద్యోగిని అసభ్య సంభాషణ ఆడియో టేపుల వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే. దేవుడి సన్నిధిలో పాపకార్యాలు చేశావంటూ పృధ్వీపై కళ్యాణి మండిపడ్డారు. ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ వల్ల తిరుమల అపవిత్ర అయిందని, ఆయన వల్ల భక్తి ఛానెల్ ఇలా ఫేమస్ అయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.