actress madhavi latha fires on jr ntr issue: తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. నాగార్జున ఎన్ క్లేవ్ కూల్చివేత ఘటన, సమంత మీద మహిళ మంత్రి వ్యాఖ్యలు ఇండస్ట్రీలోకాకరేపాయని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఘటన కూడా ఒకవైపున రాజకీయాలల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. మంచు మోహన్ బాబు ఇంటి గొడవలు సైతం రచ్చగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా పుష్ప2 మూవీ ప్రీమీయర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతిఅనే మహిళ చనిపోయింది. దీనిపై అల్లు అర్జున్ తో పాటు, సంధ్యథియేటర్ ఘటనపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. ఈ క్రమంలో.. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి రేవంత్ సర్కారు రూ25 లక్షల సహాయం చేసింది.


మైత్రీమూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి 50 లక్షలను అందజేశారు. అదే విధంగా గతంలో అల్లు అర్జున్ దేవర రిలీజ్ నేపథ్యంలో.. కౌశిక్ అనే కుర్రాడు క్యాన్సర్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే. తాను.. ఎన్టీఆర్ ను చూడాలని చెప్పడంతో.. జూనియర్ ఎన్టీఆర్ అతడితో మాట్లాడారు. కౌశిక్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చంత భరిస్తానని కూడా చెప్పాడు.


ఈ క్రమంలో అయితే తాజాగా కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పారని  కూడా బాంబు పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్ఇప్పటివరకు తనకొక రూపాయి కూడా సహాయం చేయలేదని ఈమె వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా, సినీ నటి మాధవీ లత తీవ్రస్థాయిలో సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా హీరోలు అభిమానులకు డబ్బులు ఇస్తూ పోతే.. హీరోలు చివరికి అడుక్కు తినాల్సిందేనని ఈమె మండిపడ్డారు.


Read more: Allu Arjun Police Station: పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ప్రశ్నలతో బన్ని ఉక్కిరి బిక్కిరి..


ఇలా హీరోల నుంచి డబ్బులు ఆశించే వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు అంటూ ఈమె ప్రశ్నించినట్లు తెలుస్తొంది. తాజాగా, నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.  కొంత మంది మాధవీలతను సమర్థిస్తుండగా..మరికొందరు ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.