తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో నమిత వివాహం ఘనంగా జరిగింది. తమిళ దర్శకుడు, నిర్మాత వీరేంద్ర చౌదరిని నటి నమిత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి తమిళ సినీ ప్రముఖులు, రాధిక-శరత్ కుమార్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. నమిత వివాహ రిసెప్షన్ చెన్నైలో జరగనుంది. గత రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని గత నెలలో నమిత ఒక వీడియో మెసేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నమిత 'సొంతం' సినిమా ద్వారా టాలీవూడ్ లో ప్రవేశించారు. ఆతరువాత 'ఒకరాజు ఒక రాణి', 'జెమిని', 'బిల్లా'.. తదితర చిత్రాలతో పాటు  కొలీవూడ్ లో కూడా నటించారు. సెలెబ్రిటీ రియాల్టీ షో లలో ఒకటైన బిగ్ బాగ్ షో లో కూడా పాల్గొన్నారు నమిత.