Actress Rakul Preet Singh Hospitalised: రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా హిట్ అందుకుంది. ముందుగా కెరటం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ఆమెకు హీరోయిన్ గా మొదటి హిట్ అందించింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తిస్థాయిలో ఆమె అనేక సినిమాలు చేస్తూ తెలుగులో ఒకరకంగా స్టార్ హీరోయిన్ హోదా కూడా సంపాదించింది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఆమెకు తెలుగు సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. అలాగే తెలుగు సినిమా ఆఫర్లు కూడా ఆమెకు రావడం లేదు. చివరిగా కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ సినిమాతో ఒక యావరేజ్ మూవీ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో మరో అవకాశం అయితే రాలేదు, ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఆమె బిజీ బిజీగా గడుపుతోంది.


సినిమాల్లో నటిస్తూనే జాకీ భగ్నాని అనే నిర్మాత కం నటుడిని ప్రేమించడంతో త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఒక రకంగా ఫిట్నెస్ ఫ్రీక్ అనే చెప్పాలి. బాడీ ఫిట్గా ఎలా ఉంచుకోవాలి అని ఎప్పుడూ తపన పడుతూ ఉంటుంది. ఆమెకు ఫిట్నెస్ మీద ఉన్న మమకారంతో కొన్ని జిమ్ లు కూడా స్టార్ట్ చేసి హైదరాబాద్ సహా పలుచోట్ల వాటిని రన్ చేస్తోంది.


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె కళ్ళు తిరిగి పడిపోయారని వెంటనే ఆమెని హాస్పిటల్ కోసం తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఆమె క‌ఠిన‌మైన డైట్స్‌, వ‌ర్కౌట్స్ చేస్తూ ఉండడంతో డైట్ లో కాస్త తేడా రావడంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయారని తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమేనా, నిజంగానే జరిగిందా? అనే విషయం మీద క్లారిటీ లేదు. ఆమె మేనేజర్ కానీ ఆమెకు సంబంధించిన టీం సభ్యులు ఎవరైనా కానీ స్పందించి ఈ విషయం మీద క్లారిటీ ఇస్తే కానీ ఆమె అభిమానులు ఈ విషయంలో కాస్త కుదుట పడే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇందులో ఏమాత్రం నిజానిజాలు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.


Also Read: Elimination in Bigg Boss 6: ఎలిమినేషన్స్ చివరి నిముషంలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్


Also Read: Neha Malik Pics: నేహా మాలిక్ హాట్ ట్రీట్.. అందాలన్నీ చూపిస్తూ చంపేస్తుందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి