Rakul Preet Singh: బాయ్ ఫ్రెండ్ తో కలిసి తాజ్‌మహల్‌కు సందర్శించిన రకుల్ ప్రీత్‌సింగ్
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్... ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Rakul Preet Singh and Jackky Bhagnani: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh), నిర్మాత జాకీ భగ్నానితో (Jackky Bhagnani) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ విషయం గతేడాది రకుల్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అప్పటి నుంచి ఈ జంట తెగ చక్కెర్లు కొడుతున్నారు. తాజాగా ఈ ప్రేమజంట తాజ్‌మహల్‌ను (Taj Mahal) సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
'దే దే ప్యార్ దే' దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లినట్లు సమాచారం. రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ ఇప్పటికే 'లవ్ రంజన్' వెడ్డింగ్ కోసం ఆగ్రా చేరుకున్నారు. ఇదిలా ఉండగా... రకుల్ నటించిన చాలా సినిమాలు ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అజయ్ దేవగన్‌తో రన్‌వే 34, ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ జి, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి ఎటాక్ చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. అంతేకాకుండా ఆమె సోలో లీడ్‌గా 'ఛత్రవాలి' అనే చిత్రంలో నటిస్తోంది.
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్..అనతికాలంలోనే టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. లౌక్యం, సరైనోడు, ధృవ, జయజానకి నాయకీ, ఖాకి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ..తెలుగు సినిమాల్లో పెద్దగా నటించట్లేదు.
Also Read: Mahesh Babu-Sitara: కూతురి స్టెప్పులకు సూపర్ స్టార్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి