Rashmika Mandanna Gym Workout Latest Video goes Viral: 'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన.. 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, దేవదాస్ సినిమాల్లో నటించారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక.. శ్రీవల్లి పాత్రలో అడగొట్టారు. పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ అయిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ రష్మికకు బాగానే కలిసొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో 2-3 చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న హిందీ చిత్రాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. అయితే రష్మికకు ఇన్ని ఆఫర్లు రావడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు.. అందం, ఫిట్‌నెస్‌ కూడా. ఆ ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందు కన్నడ భామ ప్రతిరోజు జిమ్‌లో కష్టపడతారు. అందుకు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. 



ఆ మధ్య జిమ్ టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు. రష్మిక ప్యాంట్ లేకుండా కేవలం పొట్టి షార్ట్ ధరించి.. వర్కవుట్స్‏తో హడావిడి చేశారు. ఎంతో యాక్టివ్‏గా తన ట్రైనర్ చెప్పే వర్కవుట్స్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా కాళ్లు, చేతులతో ఎక్కువగా జిమ్ వర్కవుట్స్ చేశారు. కష్టమైన ఫిట్లను సైతం రష్మిక ఎంతో తెలికగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే ఎవరికైనా చెమటలు పట్టేలా ఉంది. 


Also Read: IND vs SL 2nd Test: జయంత్ ఔట్.. సిరాజ్ ఇన్! జడేజా డౌట్! లంకతో డేనైట్ టెస్టులో బరిలోకి దిగే భారత జట్టిదే!!


Also Read: Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. ఐదు రోజుల్లో రూ. 3.10 పెరిగిన పెట్రోల్‌ రేట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook