Actress Sanjjanaa Galrani is pregnant: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' (Bujjigadu) సినిమాతో సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బుజ్జిగాడు సినిమాలో త్రిషతో పాటు మరో హీరోయిన్‌గా సంజనా నటించారు. ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ.. అందరిని ఆకట్టుకున్నారు. బుజ్జిగాడు సినిమా తర్వాత సమర్ధుడు, యమహా యమా, సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. ఆపై కోలీవుడ్‌ (Kollywood)లోనూ పలు సినిమాల్లో నటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంజనా గల్రానీ గతేడాది కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయి.. మూడు నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే అజీజ్‌ బాషా (Azeez Basha) అనే వ్యక్తిని సంజనా వివాహం చేసుకున్నారు. ఆపై ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఇటీవల ఆమె భర్తతో విడిపోనుందని, విడాకులు తీసుకుంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే వీటిపై మండిపడిన సంజనా.. తన వైవాహిక జీవితం బాగుందని, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: PM KISAN Money: రైతులకు షాకిచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు తిరిగివ్వకపోతే చర్యలు




సంజనా గల్రానీ వివరణ ఇచ్చినా.. ఆమెపై వైవాహిక జీవితంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తాను గర్భవతిని (Sanjjanaa Galrani Pregnant) అని చెప్పి అన్ని పుకార్లకు చెక్ పెట్టారు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నాని సంజనా పోస్ట్ చేశారు. 'మాతృత్వం అనేది గొప్ప అనుభూతి. ఇప్పుడు నేను 5 నెలల గర్భంతో ఉన్నాను. డెలివరి ముందు వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదు. కొంత మంది మహిళలు డెలివరికి రెండు వారాల వరకు కూడా పని చేస్తారు. వారి లాగే నేను కూడా ఉండాలనుకుంటున్నాను' అని సంజనా పేర్కొన్నారు. 


Aalso Read: Man Head: నల్గొండ జిల్లాలో షాకింగ్ సీన్.. దేవుడి విగ్రహం కాళ్ల వద్ద మొండెంలేని తల! నరబలి జరిగిందా?!!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి