Sneha Prasanna Divorce Rumors నాటి హీరోయిన్ స్నేహ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను బుల్లితెరపై ఎంటర్టైన్ చేసేందుకు స్నేహా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే స్నేహాకు సంబంధించిన ఓ రూమర్ ఇక్కడ తెగ వైరల్ అయింది. స్నేహా తన భర్త ప్రసన్నకు దూరంగా ఉంటోందని, విడిగా ఉంటోందని, విడాకులు తీసుకుంటోందని ఇలా రూమర్లు వచ్చాయి. వాటిపై స్నేహా అయితే అధికారికంగా ఎక్కడా కూడా స్పందించలేదు. తన భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు మరోసారి స్నేహా తన భర్త మీద ప్రేమను చాటుకుంది. తన భర్త మీద స్నేహా వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్నేహా, ప్రసన్నలది ప్రేమ వివాహాం అన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలో కలిసి చేసినప్పుడు అంతగా స్నేహం ఉండేది కాదని, ఆ తరువాత తమ మధ్య ప్రేమ పుట్టిందంటూ స్నేహా, ప్రసన్నలు తమ లవ్ స్టోరీని ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.


 



నువ్ పర్ఫెక్ట్ అని నిన్ను లవ్ చేశాను.. అయితే నువ్ పర్ఫెక్ట్ కాదని తెలిసింది.. అయినా నేను అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటూ భర్త మీదున్న ప్రేమను స్నేహా చాటుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్, స్నేహా ప్రసన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక స్నేహా తన ఫ్యామిలీ, పిల్లల గురించి నెట్టింట్లో వేసే పోస్టులు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి యాడ్స్‌లో నటిస్తుంటారన్న సంగతి తెలిసిందే.


స్నేహా ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ అనే షోకు జడ్జ్‌గా చేస్తోంది. శివ బాలాజీతో కలిసి స్నేహా ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. వినయ విధేయ రామా సినిమాతో సెకండ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ స్నేహా మరో సినిమాకు సైన్ చేయలేకపోయింది.


Also Read : Nayanthara Surrogcay : ఈ ఏడాదిలో పెళ్లై, తల్లైన హీరోయిన్లు వీరే.. సహజగర్భంతో వాళ్లు, సరోగసితో నయన్


Also Read : 18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. ప్రతీ పేజీ ప్రేమతో నిండింది


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook