Jayamma Panchayathi: సుమ నోట `బూతు` మాట... ఆకట్టుకుంటోన్న `జయమ్మ పంచాయితీ` ట్రైలర్...
Jayamma Panchayathi Trailer: సుమ ప్రధాన పాత్రలో నటిస్తోన్న `జయమ్మ పంచాయితీ` సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం.
Jayamma Panchayathi Trailer: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఇందులో సుమ పల్లెటూరి మహిళ 'జయమ్మ'గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, సాంగ్స్ ఆకట్టుకోగా... తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.
ట్రైలర్ విషయానికొస్తే.. హాస్యం, ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జయమ్మ అనే మహిళ ఓ సమస్య విషయంలో ఊరి పెద్దలను ఆశ్రయించి పంచాయితీ పెట్టడం అనే లైన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే జయమ్మ ఎందుకు పంచాయితీ పెద్దలను ఆశ్రయించదనేది సస్పెన్స్‌గా ఉంచారు. ట్రైలర్‌లో సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా సుమ పలికిన 'ఎవలివల్ల సెడ్డావురా ఈరన్నా అంటే.. నోటివల్ల సెడ్డానురా కాటమరాజా అన్నాడట..' అనే డైలాగ్ బాగుంది. ఇక ట్రైలర్ చివరలో సుమ నోట పలికి పలికినట్లుగా ఓ బూతు మాట కూడా వినిపించింది.
ట్రైలర్ మొదట హాస్యభరితంగా, ఆ తర్వాత ఎమోషనల్‌గా సాగింది. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే 'జయమ్మ.. జయమ్మ..' అనే సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. చాలా రోజుల తర్వాత సుమ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షుకల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read: KGF2 Advance Bookings Collection: కేజీఎఫ్2 అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఎంతంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook