Vaishali Takkar Death Reason: అతని వేధింపులతోనే వైశాలి మృతి..ఒకపెళ్లి క్యాన్సిల్ చేసి మరోపెళ్లిపై కూడా కన్ను?
Vaishali Takkar death Reason: వైశాలి టక్కర్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయంలో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు
Vaishali Takkar death Reason: హిందీ బుల్లితెర నటి వైశాలి టక్కర్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు కావడం సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మరణం సమయంలో పలువురికి వ్యతిరేకంగా ఆమె గళం ఎత్తిన నేపథ్యంలో ఆమె మరణం వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె మరణానికి ముందు ఒక సూసైడ్ రాశారు.
ఆ సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం ఏమిటని విషయాన్ని ఆమె వెల్లడించారు. తన జీవితంలో అతిపెద్ద విలన్ రాహుల్ నవ్లానీ, అతని వల్లే తన పెళ్లి క్యాన్సిల్ అయిందని సూసైడ్ నోట్లో వైశాలి ఠక్కర్ పేర్కొన్నారు. వైశాలి మాట్రిమోనీలో పరిచయమైన డెంటిస్ట్ డాక్టర్ అభినందన్ సింగ్ తో 2021లో నిశ్చితార్థం చేసుకుంది. కెన్యాలో నివాసం ఉండే అభినందన్ సింగ్ తో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు వైశాలి చాలా ఉత్సాహంగా ఉన్న సమయంలో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ దృష్టిలో ఈ విషయం పడడంతో రిలేషన్ లో ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను వైశాలి కాబోయే భర్తకు రాహుల్ పంపించాడు.
దీంతో అభినందన్ సింగ్ వైశాలితో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగానే వివాహం రద్దయిందని అప్పట్లో వైశాలి కవర్ చేసుకుంది. ఇక అక్టోబర్ 20వ తేదీన వైశాలి అమెరికాకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకునేందుకు మళ్లీ సిద్ధమైంది. ఈసారి కూడా రాహుల్ మళ్లీ గతంలో చేసినట్లుగానే ఫోటోలు పంపి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాడేమో అని భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ ఈ మేరకు ఆమెను బెదిరించినట్లు సూసైడ్ నోట్లో చెబుతున్నారు. మరో వైశాలి సూసైడ్ నోట్లో రాసిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే వైశాలి పెళ్లి చేసుకోకుండా అడ్డుపడుతున్న రాహుల్ కి ఇప్పటికే పెళ్లయింది. అతని భార్య పేరు దివ్య కాగా దివ్యకు ఈ మొత్తం విషయం తెలిసినా తన భర్త మీద ఉన్న ప్రేమతో అతనికి సపోర్ట్ చేస్తుందని వైశాలి పేర్కొంది. తొలుత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణంతో వైశాలి టక్కర్ సూసైడ్ కి కూడా ఏదైనా లింక్ ఉందేమో అనే ప్రచారం జరిగింది కానీ ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Also Read:Kantara Telugu Movie Collections : కాంతారా రెండో రోజు కలెక్షన్లు.. కుమ్మి అవతలపారేసిందిగా
Also Read: Kantara Film Tollywood: కాంతార సినిమాను తెలుగోళ్లు చేసుంటే హిట్ అయ్యేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook