Adbhutham Trailer: జాంబి రెడ్డి సినిమాతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన ఒకప్పటి బాల నటుడు తేజ సజ్జ హీరోగా వస్తోన్న అప్‌కమింగ్ సినిమా పేరే అద్భుతం. తేజ సజ్జ సరసన డా రాజశేఖర్, జీవిత దంపతుల కూతురు శివాని రాజశేఖర్ (Actress Shivani Rajasekhar) జంటగా నటిస్తోంది. ఒకే మొబైల్ నెంబర్ ను ఆపరేటర్ ఇద్దరికి కేటాయిస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ? ఆ ఇద్దరు ఎదుర్కొనే ఇబ్బందులు ఎలా ఉంటాయనే కాన్సెప్టుతో తెరకెక్కిన లవ్ స్టోరీ ఈ సినిమా. తాజాగా మేకర్స్ అద్భుతం ట్రైలర్ రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన అద్భుతం సినిమా (Adbhutham Trailer) ఈ నెల 19 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌పై ప్రసారం కానుంది. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధన్ మ్యూజిక్ అందించాడు.