Prabhas, Aamir Khan Movies: బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్‌ ప్రతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రతి కొత్త సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ప్రభాస్‌ ప్రతి మూవీని ఎంతో భారీగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున బడ్జెట్‌ పెడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా భారీగా నిర్మిస్తోన్న ప్రభాస్‌ అప్‌కమింగ్‌ మూవీల్లో ఆదిపురుష్‌ సినిమా ఒకటి. బాలీవుడ్‌ డైరెక్టర్‌‌ ఓంరౌత్‌ ప్రభాస్‌తో ఆదిపురుష్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరుకెక్కుతోన్న ఆదిపురుష్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ మూవీలో ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్‌ ప్రభాస్‌ సరసన నటిస్తోంది. ఇక సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా ఈ మూవీలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా భాగం కూడా షూటింగ్‌ పూర్తి అయింది. అయితే ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్‌ చేయాలనుకున్న మూవీ యూనిట్‌.. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 


అమీర్ ఖాన్ లాల్‌సింగ్‌ చద్ధా మూవీ వల్ల ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయింది. లాల్‌సింగ్‌ చద్ధా సినిమా గతేడాదే రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. 


అయితే లాల్‌సింగ్‌ చద్ధా సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ కూడా వచ్చేసింది.. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన లాల్‌సింగ్‌ చద్ధా మూవీ రిలీజ్‌ కానుంది. అయితే అదే రోజు ఆదిపురుష్‌ మూవీ రిలీజ్‌ కావాల్సి ఉంది.. కానీ లాల్‌సింగ్‌ చద్ధా మూవీ కోసం ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అద్వైత్‌ చందన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన లాల్‌సింగ్‌ చద్ధా సినిమాలో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. 


Also Read: Bheemla Nayak: పవర్​ స్టార్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​- భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడు!


Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి