బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న నటుడు, దర్శకుడు రవి బాబు తెరకెక్కిస్తున్న అదుగో సినిమా టీజర్ ఇవాళ రిలీజైంది. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తు్న్న ఈ సినిమా కోసం దర్శకుడు రవిబాబు చాలానే శ్రమిస్తున్నాడు. పంది పిల్ల చుట్టూ తిరిగే కథాంశం కావడంతో సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కాస్త ఎక్కువ మోతాదులోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. రవి బాబు, ప్రశాంత్ విహారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ టీజర్ వీడియోలో పేర్కొన్నారు. ఈ సినిమాలో బంటి అనే పంది పిల్ల చేసిన మేజిక్ ఎలా ఉండనుందో తెలియాలంటే, అంతకన్నా ముందుగా ఈ శాంపిల్ టీజర్ చూడాల్సిందే.