Bollywood Actor in SSMB29: ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా గురించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవ్ దత్త తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో దేవ్ దత్త హనుమంతుడి పాత్ర పోషించారు. 


ఆదిపురుష్ సినిమాలో మంచి పాత్ర దొరికినప్పటికీ దేవ్ దత్తకి తెలుగులో అంతగా పేరు రాలేదు. కానీ తాజాగా ఇప్పుడు దేవ్ దత్తకి.. తెలుగు నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దేవ్ దత్త.. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా బయటకు రాలేదు. 


ఈమధ్య రాజమౌళి దేవ్ దత్త కలిసి ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీంతో దేవ్ దత్త రాజమౌళి మహేష్ బాబు సినిమాలో కూడా నటిస్తున్నారు అని పుకార్లు మొదలయ్యాయి. 


ఒకవేళ ఇది నిజమే అయితే.. చిత్ర బృందం ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తుందో చూడాలి. మరోవైపు రాజమౌళి సైలెంట్ గా సినిమాకి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది అని, మ్యూజిక్ వర్క్ కూడా మొదలైపోయింది అని వార్తలు వినిపించాయి. 


మరోవైపు చిత్ర బృందం దుబాయ్ లో వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపించింది. సినిమా కోసం మహేష్ బాబు బాడీ బిల్డ్ చేస్తున్నారని, గడ్డం కూడా పెంచుతున్నారు అని కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఏదేమైనా సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సినిమా మీద క్రేజ్ ని మరింతగా పెంచుతూ వస్తోంది.


Also read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనతో 70 లక్షలు పొందడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook