Adipurush Movie: ఆదిపురుష్ మూవీని ఊరిస్తున్న ఓపెనింగ్ డే రికార్డులు
Adipurush Movie Opening Day Collections: భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వస్తోన్న ఆదిపురుష్ చిత్రం విడుదలకు కేవలం మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్యాన్ ఇండియా ప్రభాస్ అభిమానుల్లో అంతే భారీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఆదిపురుష్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది.
Adipurush Movie Opening Day Collections: భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వస్తోన్న ఆదిపురుష్ చిత్రం విడుదలకు కేవలం మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్యాన్ ఇండియా ప్రభాస్ అభిమానుల్లో అంతే భారీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతి సనన్ సీతమ్మ పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఆదిపురుష్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలుగా ఉంది. సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు U సర్టిఫికేట్ ఇచ్చారు. పీవీఆప్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి ఫేమస్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఓపెనింగ్ రోజే 62,000 టిక్కెట్లు అమ్ముడవడంతో ఆదిపురుష్ మూవీ ఒకరకంగా విడుదలకు ముందే రికార్డులు సెట్ చేస్తోంది.
ఆదిపురుష్ మూవీ హిందీ వెర్షన్ తొలి వీకెండ్‌కి గాను దాదాపు 1.13 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే సినిమాపై ప్యాన్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హిందీలో అత్యధిక సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఆదిపురుష్ ఒకటిగా నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ గణాంకాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఆదిపురుష్ మూవీకి ప్రిరిలీజ్ బిజినెస్ భారీగానే ఉందని ఫిలిం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి నాటికి మొత్తం 2.5 లక్షల టిక్కెట్స్ ని సేల్ చేయాలని ఆదిపురుష్ మూవీ యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆదిపురుష్ గణత గురించి ఇంకా చెప్పాలంటే.. విడుదల అవుతున్న అన్ని భాషల్లోనూ ఆదిపురుష్ మూవీ టిక్కెట్లు ఇప్పటికే 1 లక్ష అడ్వాన్స్ బుకింగ్ దాటాయని బాక్సాఫీస్ వర్గాల టాక్. మల్టీప్లెక్సుల వారీగా చెప్పాలంటే.. పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో భారతదేశం అంతటా ఆదిపురుష్ మూవీకి 1 లక్షకుపైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని ప్రకటించాయి.
ఆదిపురుష్ పఠాన్, కెజిఎఫ్ 2, బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లను 1వ రోజు స్వాధీనం చేసుకుంటారా?
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునె జంటగా వచ్చిన పఠాన్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన KGF 2, రణబీర్ కపూర్, నాగార్జున, ఆలియా భట్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర వంటి ఇతర చిత్రాలతో పోల్చితే, ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా... ఇంకా ప్రత్యేకించి చెప్పుకోవాలంటే హిందీ బాక్సాఫీస్ మార్కెట్‌లో మాంచి దూకుడు ప్రదర్శిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు సినిమా విడుదల రోజు వచ్చే స్పాట్ బుకింగ్స్‌లో కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే... హిందీ మార్కెట్‌లో దాదాపు రూ. 25 నుండి రూ. 30 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.