Adipurush Update: అవును నిజమే.. ఆదిపురుష్ టీజర్ విడుదల తేది అదే..!
Adipurush Teaser Update: ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఫామ్ తో ముందుకు వెళుతున్నారు. ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Adipurush Teaser Update: ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఫామ్ తో ముందుకు వెళుతున్నారు. ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రీకరణ ముగియగా.. చిత్ర బృందం ఇప్పటికీ ఎలాంటి పోస్టర్ను విడుదల చేయకపోవడం విశేషం. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా రూపొందినట్లు సమాచారం.
ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే వచ్చే సంవత్సరంలో పలు భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు దగ్గరకు వచ్చిన.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇంతవరకు విడుదల చేయలేదు. అయితే ఈ టీజర్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ నిరీక్షిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ ఫస్ట్ లుక్ పై సమాచారం లేకపోవడం విశేషం.. అయితే చిత్ర బృందం ప్రభాస్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని.. ఆదిపురుష్ మూవీకి సంబంధించిన అప్డేట్ ను అందించింది. అయితే ఈ అప్డేట్ లో భాగంగా ఆ మూవీకి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులకు తెలిపింది.
ఏకంగా టీజర్ నే విడుదల చేయనుంది. ఇక టీజర్ విషయానికొస్తే.. దసరా నవరాత్రుల్లోని అయోధ్యలో ఏర్పాటుచేసిన ఓ గ్రౌండ్ లోనే ఉత్సవాల్లో భాగంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఇక టీజర్ విడుదల నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏకధాటిగా సినిమా ప్రమోషన్ జరగనున్నట్లు సమాచారం. ఇక చిత్ర బృందం విషయానికొస్తే.. ఈ సినిమాకు దర్శకుడిగా ఓమ్ రౌత్ వ్యవహరించగా.. ప్రభాస్ ప్రధాన పాత్రధారులుగా రాముడిలా కనిపించనున్నారు.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి