Adivi Sesh Breakup Story : శేష్ పుట్టినరోజే ఆమె పెళ్లి.. ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడుగా!
Adivi Sesh Breakup Story : ఇటీవల మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన అడివి శేష్ తాజా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీ బయట పెట్టాడు.
Adivi Sesh Breakup Story : ఇటీవల మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు అడివి శేష్. ఈ సినిమా సక్సెస్ లో ఉండడంతో ఆయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అలాగే వరుస ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న అడివి శేష్, తన బ్రేకప్ కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటివరకు అడవి శేష్ ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా బయటకు వెల్లడించలేదు.. కానీ తాజా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీ బయట పెట్టాడు.
నిజానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు అడివి శేష్ అమెరికా వెళ్లి అక్కడే చాలా రోజుల పాటు తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అక్కడే కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేశారు. తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి తొలుత చిన్న చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ తర్వాత క్షణం సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో అలీ తన పెళ్లి గురించి ప్రస్తావన తీసుకు రావడంతో అడివి శేష్ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తన తల్లి ఇప్పటికే పెళ్లి చేసుకోమని గొడవ పెడుతోందని పేర్కొన్న అడవి శేష్ తాను గతంలో ఒక బ్రేకప్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. తాను అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే మా ప్రేమ సఫలం కాలేదని ఆయన చెప్పుకొచ్చాడు. నా పుట్టినరోజు నాదే ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని అలా ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని అడవి శేష్ వెల్లడించాడు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి ప్రస్తుతం ప్రోమో మాత్రమే విడుదలైంది. పూర్తి వీడియో గనుక విడుదల అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమా తాజాగా తెరకెక్కించారు అడివి శేష్. మహేష్ బాబు నిర్మాణంలో సోనీ పిక్చర్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఒక దేశ భక్తుడి సినిమా కావడంతో సినిమా విడుదల కాకముందే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచి కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో సినిమా మరిన్ని కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.
Also Read: Major Special Offer: 'మేజర్' మూవీ స్పెషల్ ఆఫర్.. టికెట్ ధరపై 50 శాతం రాయితి!
Also Read: Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook