Nani Upcoming Movies: దసరా, హాయ్ నాన్న, సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నేచురల్ స్టార్ నాని.. తాజాగా విడుదలైన సరిపోదా శనివారం సినిమాతో నాని ఏకంగా హాట్రిక్ కొట్టేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆగస్టు 29న విడుదలైన ఈ చిత్రం.. మిశ్రమా స్పందన అందుకుంటున్నప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం బాగానే సక్సెస్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల గురించి పక్కన పెడితే.. నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు తారాస్థాయికి చేరుకున్నాయి. నార్త్ అమెరికాలో నాని కెరియర్ లోనే.. అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమాగా.. 
సరిపోదా శనివారం సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో నాని నెక్స్ట్ సినిమా గురించి సర్వర్త్రా ఆసక్తి నెలకొంది. నిజానికి దసరా సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతోనే నాని ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా గురించి ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా తర్వాత నాని మళ్లీ దసరా డైరెక్టర్ తోనే సినిమా చేస్తారని.. అందరు అనుకున్నారు. కానీ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సమాచారం ప్రకారం  నాని.. ఈ సినిమాని పక్కన పెట్టి మరొక సినిమాని లైన్లో పెడుతున్నట్లు వార్తలు గట్టిగా వినిపించాయి.


హిట్ 1,2 సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన నాని.. హిట్ 3 సినిమాలో హీరోగా కనిపిస్తున్నారని.. ఈ సినిమా షూటింగ్తో బిజీ కాబోతున్నారని..దీనికోసం దసరా డైరెక్టర్ తో చేయాల్సిన సినిమాని కాస్త వెనక్కి తోశారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అంతేకాకుండా శ్రీకాంత్ ఓదెలతో రెండవ సినిమాను 2025కు వాయిదా వేశారు అని మరికొన్ని వెబ్సైట్లో ప్రచారం జరిగింది. 


అయితే ఈ విషయంపై ఫైనల్గా దర్శకుడు శ్రీకాంత్ స్పందించారు. ఈ వార్తలు అన్నీ అసత్యపు ప్రచారాలని.. అప్డేట్స్ తామే అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నామని.. ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ రావడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని చెప్పుకొచ్చారు. మరి ఇంత చెప్పిన ఈ డైరెక్టర్.. నాని సినిమా త్వరలోనే మొదలుపెడతారా.. లేదా నిజంగానే హిట్ 3 షూటింగ్ తరువాత మొదలు పెడతారా అనేది తెలియాల్సిన విషయం.


Also Read: Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు


Also Read: Telangana Floods: విరాళంపై రగడ.. వైజయంతి మూవీస్‌కు తెలంగాణ విద్యార్థుల వార్నింగ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter