AHA OTT:  దసరా నుంచి సంక్రాంతి వరకు నాన్ స్టాఫ్ సినిమాలు, షోలు అందించేందుకు ఆహా(AHA) సిద్దమైంది. తొలి తెలుగు ఓటీటీ(OTT)గా వచ్చిన ఆహా..అతి తక్కువ సమయంలోనే గుర్తింపు పొందింది. ఆహా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా...వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజాగా సబ్ స్కైబర్లను పెంచుకోనేందుకు ఆహా సరికొత్త ప్రణాళికను రచించింది.  ఇందులో భాగంగానే మొత్తం 12 వారాల్లో (90 రోజులు), 20 కొత్త సినిమాలు, షోలతో ఫుల్‌ ప్యాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నట్లు ట్విట్టర్‌(Twitter) వేదికగా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహా ఈ మూడు నెలల్లో ప్రేక్షకుల కోసం తీసుకురానున్న సినిమాలు(Movies), వెబ్ సిరిస్(Webseries) లకు సంబంధించి ఒక స్పెషల్ వీడియోను పోస్ట్  చేసింది. ఈ పండక్కి అందిస్తోన్న సినిమాల్లో 9 వరల్డ్‌ డిజిటల్‌ ప్రిమియర్స్‌ సినిమాలు ఉన్నట్లు ప్రకటించింది. త్వరలో ఆహాలో రాబోతున్న ముఖ్యమైన సినిమాల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, లవ్‌స్టోరీ, లక్ష్య (నాగశౌర్య), మంచి రోజులు వచ్చాయ్‌, డీజే టిల్లు, రొమాంటిక్‌ (ఆకాష్‌ పూరి), అనుభవించు రాజా, పుష్పక విమానం, గని వంటి చిత్రాలు ఉన్నాయి.


Also read: Bigg Boss 5 Telugu: బ్రదర్‌, సిస్టర్‌ల బ్రేకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా..బిగ్‌బాస్‌ కొత్త ప్రోమో చూశారా.?


ఇక వీటితో పాటు ఆహా ఒరిజినల్స్‌.. సేనాపతి, భమా కలాపం (ప్రియమణి), త్రీ రోజేస్‌, అన్యాస్‌ ట్యూటోరియల్‌, అడల్టింగ్‌, ఇట్స్‌ నాటే ఏ లవ్‌ స్టోరీ, సేఘు టాకీస్‌, ఇంటింటి రామాయణం, క్యూబుల్‌ హై, సర్కార్‌లతో పాటు నందమూరి బాలకృష్ణ(BalaKrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘'అన్‌స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే'’ వంటి షోలు ఉన్నాయి. ఇలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలతో ఆహా సరికొత్త వీనుల విందును అందించేందుకు సిద్ధమైందన్న మాట. ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే ఆహాకు సబ్‌స్క్రైబ్‌ అయ్యి ఈ వినోదాల జడివానలో మీరూ తడిచిపోండి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook