Drunk And Drive Case Video : తప్పతాగి `ఆహా` ఉద్యోగి వీరంగం.. పోలీసులతో వాగ్వాదం.. వీడియో వైరల్
Aha Employee Drunk And Drive ఆహా ఉద్యోగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా పోలీసులుతో దుర్భాషలాడటం, కాలితో తన్నడం వంటివి కూడా చేయడంతో మరింతగా రచ్చగా మారే అవకాశం ఉంది.
Aha Employee Drunk And Drive మద్యం మత్తులో యువకుడి, యువతి హల్చల్ అనే హెడ్డింగులతో రోజూ ఎన్నో వార్తలు చూస్తుంటాం. అయితే ఇందులో కొంత మంది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆ స్పెల్లింగ్ వచ్చా రాదు.. ఈ స్పెల్లింగ్ వచ్చా.. రాదు అంటూ ఓ కుర్రాడు ఫేమస్ అయ్యాడు. అలా ప్రతీ సందర్భంలో జరగకపోవచ్చు. అయితే ఇప్పుడు ఓ యువకుడు పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆహా ఓటీటీ సంస్థలో పని చేసే గౌరవ్ నిన్న రాత్రి వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసులకు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు. బ్రీత్ అనలైజర్లో 90కి పైగా పాయింట్లు రావడంతో పోలీసులు కేసు నమోదు చేయాలని అనుకున్నారు. అయితే కారులోంచి సదరు యువకుడు మాత్రం బయటకు రాలేదు. పక్కనే ఉన్న యువతి సైతం రెచ్చిపోయింది.
నాకు హైకోర్ట్ జడ్జ్ తెలుసు.. అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడాడు. బూతులు తిడుతూ ఎస్సైని కాలితో తన్నాడు. సెక్షన్లు తెలుసా? అంటూ ఏదో పిచ్చి సెక్షన్ పేరు చెప్పాడు. సెక్షన్ 123 అంటూ తాగిన మత్తులో ఏదో వాగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో మీద జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఉద్యోగంలోంచి పీకేసి ఉంటారు.. అల్లు అరవింద్ ఒకే వేళ స్పందించాల్సి వస్తే.. మాకేం సంబంధం లేదు అని అంటాడు అనే కామెంట్లు వస్తున్నాయి. వీడు చేసిన ఎక్స్ ట్రాలకు రాత్రంతా వీడిని ఆడేసుకుని ఉంటారు అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అలా మొత్తానికి ఈ వీడియో మాత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook