Aha Naa Pellanta Web Series Streaming:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 29 ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రత్యేకతకు ఎంటర్టైన్మెంట్ జోడి చేయడానికి జీ సినిమాలు ఒకసారి కొత్త సర్ప్రైజ్ తో సిద్ధమైపోయింది. ఎల్లప్పుడూ మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ సినిమాలు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ -అహ నా పెళ్లంట మొత్తం సీజన్ని సినిమాగా అందించనుంది. 


రాజ్ తరుణ్ హీరోగా.. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన ఈ వెబ్ సిరీస్ అప్పట్లో జి ఫైవ్ లో విడుదలై ఎంతో సక్సెస్ అందుకుంది. ఈ వెబ్ సీరియస్ చూసిన వారందరూ ఇది సినిమాగా విరుదలై ఉన్న మంచి విజయం సాధించి ఉంటుందని కామెంట్లు పెట్టసాగారు.
జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ లో ఈ సిరీస్ ప్రత్యేక స్థానం పొందింది.


ఇలా ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది. 


ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్ తో చెప్పే కథే అహ నా పెళ్లంట. ఈ సిరీస్ కథ మొత్తం శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ  అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను. కానీ అనుకోకుండా మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. తర్వాత ఊహంచని ట్విస్ట్ తో కథ మలుపు తిరుగుతుంది. అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? మహా, శీను జీవితాన్ని మారుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే జీ సినిమాలులో సినిమాగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే. 


జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో హీరో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ నటి ఆమని నటించగా, నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో నటించారు. భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అహ నా పెళ్లంట ఈ గురువారం మీ ముందుకు రాబోతుంది..  ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ సినిమాలులో ఈ వెబ్ సిరీస్ ప్రచారం కానుంది.


Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?


Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook