Aha Twitter DP NBK PSPK Unstoppable ఆహా టీం తమ మీద జరగబోయే దాడి గురించి ముందుగానే జాగ్రత్తలు పడుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా క్రాష్‌ అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ దెబ్బకు ఇంకేం అవుతుందో అని ఆహా టీం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందట. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంత మంది ఒకే సారి వచ్చినా కూడా తట్టుకునేలా ఆహా టీం బ్యాక్ అప్ టీంను పెట్టుకుందట. ఇక ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా వస్తుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహా టీం అయితే ఈ ఎపిసోడ్ కోసం బాగానే ప్లాన్స్ వేస్తోందని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను వాడుకుని ఆహాను మరింతగా ముందుకు తీసుకెళ్దామని భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే బాలయ్య, పవన్ ముచ్చట్ల మీద మరింతగా ఆసక్తి కలిగించేలా ప్రోమోలను కట్ చేశారు. మెల్లిగా ఊరిస్తూ వస్తున్నారు.


 



ఈ ఎపిసోడ్‌ను సైతం రెండు పార్టులుగా వదులుతున్నారు. దీంట్లో ఒక పార్ట్ నేటి రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ కాబోతోంది. అయితే ఇప్పుడు ఆహా సోషల్ మీడియా టీం మాత్రం ఈ ఎపిసోడ్‌ను వీలైనంతగా ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆహా సోషల్ మీడియా హ్యాండిల్ డీపీలను చేంజ్ చేసింది.


పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తుండటంతో.. పవర్ స్టార్ బొమ్మలను డీపీగా పెట్టేసుకుంది. ఇలా ఆహా మొదటిసారిగా డీపీని చేంజ్ చేసింది. ఈ ఎపిసోడ్‌ను ప్రమోట్ చేసుకునే వీలున్న ఏ చిన్న సందర్భాన్ని, దారిని కూడా ఆహా వదులుకోవడం లేదు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో మొదటి సారిగా పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్లు, భార్యల మీద స్పందించబోతోన్నాడు. దీంతో అందరి దృష్టి ఆ ఎపిసోడ్ మీద పడింది.


Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే


Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook