Trolls On Aishwarya Rai Bachchan: మాజీ విశ్వ సుందరి, అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటే పడి చచ్చే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఐశ్వర్య రాయ్ అనగానే.. ఆమెను ఆరాధ్యంగా చూస్తారు అభిమానులు. ఎంతోమంది గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఐశ్వర్య ఇటీవలే.. మణిరత్నం దర్శకత్వం వహిస్తూ నిర్మించిన "పొన్నియన్ సెల్వన్" చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఐశ్వర్య. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో ఆమెని కొంత మంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే..? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో అనేక మంది మోడల్స్, సెలబ్రిటీస్‌తో పాటుగా ర్యాంస్‌పై నడిచారు ఐశ్వర్య రాయ్. చాలాకాలం తర్వాత ర్యాంప్ వాక్ చేసిన ఆమె బంగారు రంగు దుస్తులలో మెరిశారు. దీనికి సంబందించిన ఒక వీడియో బయటకొచ్చింది. నిజానికి ఇది ఐశ్వర్య ర్యాంప్ వాక్‌కి సంబందించిన రిహార్సల్ వీడియో. అయితే ఈ వీడియోని చూసి కొంత మంది ఐశ్వర్య స్టైల్‌పై విరుచుకు పడ్డారు. ఆమె వేసుకున్న దుస్తులతో పాటు ఆమె నడక, స్టైల్, బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్‌ని ఎత్తి చూపుతూ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు.


ఐశ్వర్య రాయ్ బరువు పెరిగిందని.. ఆమె శరీరంపై ఆమెకి కంట్రోల్ ఉండట్లేదని.. మునుపటిలా ర్యాంప్‌పై నడవడానికి ఆపసోపాలు పడుతుందని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎగతాళి చేశారు. అంతే కాకుండా ఆమె ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుందని.. మునుపటిలాగా ఆకర్షణ కోల్పోయిందని కామెంట్స్ చేశారు. ఇంకొంత మందైతే బొటిక్స్‌ను అతిగా ఉపయోగించడం వల్ల ఐశ్వర్య ఇలా తయారైందంటున్నారు. 


కెరీర్ ఆరంభం నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కొత్తేమి కాదు. కెరీర్ తొలి నాళ్లలో కూడా ఆమె శరీర ఆకృతిని విమర్శిస్తూ చాలా మంది బాడీ షేమింగ్ చేశారు. కానీ ఏ రోజు కూడా ఐశ్వర్య ఈ విమర్శలని సీరియస్‌గా తీసుకున్నది లేదు. ఇప్పుడు కూడా తన మీద జరుగుతున్న ఈ డిబేట్లని అస్సలు పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఐశ్వర్య రాయ్ తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన రాలేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించనున్నారనే టాక్ నడుస్తోంది.


Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   


Also Read: TS Assembly Elections: కేసీఆర్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి