Aishwarya Rai Bachchan Assets ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు ఎన్ని కోట్ల సంపద ఉంటుందో తెలుసా? ఇన్ని వందల కోట్లున్నాయా? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఐశ్వర్యకు ఉన్న ఆస్తుల విలువలు, లగ్జరీ కార్లు, విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆమె రెమ్యూనరేషన్‌ ఇలా అన్నీ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2తో ఐశ్వర్య రాయ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొన్నియిన్ సెల్వన్ 2లో ఐశ్వర్య లుక్స్, నటన ఇలా అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఐశ్వర్యం మీద అందరి దృష్టి పడింది. ఐశ్వర్యకు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, ఆడి వంటి కార్లున్న సంగతి తెలిసిందే. ఇండియాలో, విదేశాల్లోనూ ఇతరత్రా ఆస్తులున్నాయట. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఐశ్వర్య వ్యవహరిస్తుంటుంది. ఇక ఇండియాలోనే టాప్ మోస్ట్ పెయిడ్ హీరోయిన్‌గానూ పేరు ఉంది.


ఆమె ఒక్కో సినిమాకు దాదాపుగా రూ. 12 కోట్లు తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఇక బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఐశ్వర్యకు చాలా వస్తుందట. అలా మొత్తంగా కలిపి ఐశ్వర్యకు దాదాపు 770 కోట్లకు పైగా ఆస్తులున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యకే ఇలా ఉంటే.. అమితాబ్ ద్వారా అభిషేక్‌కు ఇంకా ఎంత వస్తుందనే చర్చలు కూడా మొదలయ్యాయి.


Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే


బాలీవుడ్‌లో హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి హీరోయిన్ల డబుల్ డిజిట్స్‌లో రెమ్యూనరేషన్లు తీసుకుంటారు. కానీ సౌత్ హీరోయిన్లకు అంత మొత్తంలో అందదు. నయన్, సమంత వంటి వారు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటారు. కోటి, రెండు కోట్ల రేంజ్‌లోనే ఎక్కువ మంది హీరోయిన్లుంటారు. కానీ దీపిక, ఐశ్వర్య, ప్రియాంక, అలియా వంటి వారు మాత్రం డబుల్ డిజిట్స్‌లో తీసుకుంటారని తెలుస్తోంది.


Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook