Thalaivar169: సూపర్ స్టార్ సరసన ఐశ్వర్య రాయ్.. రోబో కాంబినేషన్ రిపీట్!
Aishwarya Rai confirmed opposite Rajinikanth in Thalaivar 169. తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జతకట్టనున్నారట.
Aishwarya Rai Bachchan to act with Rajinikanth in Thalaivar 169 Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇది వరకే కలిసి నటించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి 'రోబో' సినిమా చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. రజినీ-ఐశ్వర్య కాంబినేషన్ కూడా అంతే హిట్ అయింది. రోబో తర్వాత ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించలేదు. దశాబ్దకాలం తర్వాత రజినీ-ఐశ్వర్య మళ్లీ కలిసి నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జతకట్టనున్నారట. సూపర్ స్టార్ 169వ (Thalaivar169) సినిమాలో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించనున్నారట. ఈ వార్త నిజమైతే రజినీ-ఐశ్వర్య జోడీ 12 ఏళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతుండటం విశేషమనే చెప్పాలి. 'బీస్ట్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బీస్ట్ సినిమా ఫ్లాఫ్ కావడంతో రజినీకాంత్ పునరాలోచనలో పడ్డాడని నెట్టింట వార్తలు వచ్చాయి. అలాంటిది ఏమీ లేదని రజినీ, నెల్సన్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఈ సినిమాతోనైనా నెల్సన్ దిలీప్ కుమార్ భారీ హిట్ ఇస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ 169వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. 2023 ఏప్రిల్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
Also Read: Priyanka Chopra Pics: హద్దులు దాటేసిన ప్రియాంక చోప్రా అందాల ప్రదర్శన.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Nidhhi Agerwal Pics: నిధి అగర్వాల్ అందాల జాతర.. కుర్రకారుకు కునుకు కష్టమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook