Ajith Fan Suicide: సినిమా చూడనివ్వలేదని అజిత్ ఫ్యాన్ సూసైడ్..అసలు ఏమైందంటే?
Ajith Fan Suicide: అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాను చూడనివ్వలేదని అజిత్ ఫ్యాన్ సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Ajith Fan Suicide at Tamilnadu: ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్లు చేసుకుంటున్న వారు ఎక్కువైపోయారు. అమ్మ తిట్టిందని ఒకరు, నాన్న కొట్టాడని ఒకరు, లవర్ మాట్లాడడం లేదని ఒకరు, ఇలా క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారాలు కోకొల్లలుగా మారిపోయాయి. అయితే తమిళనాడులో మాత్రం ఒక వ్యక్తి తన అభిమాన హీరో సినిమా చూడలేకపోయాను అని సూసైడ్ చేసుకున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే తమిళనాడులోని తూతుకుడిలో ఒక అజిత్ అభిమాని తన అభిమాన హీరో నటించిన తునివు సినిమా చూడాలని ప్రయత్నించాడు. కానీ చూడనివ్వక పోవడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మరో అజిత్ అభిమాని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ‘’వీరబాగు స్వస్థలం తూత్తుకుడి, అజిత్‌కు వీరాభిమాని అయిన ఆయన కుటుంబ సమేతంగా తునివు సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లారు.
అయితే వీరబాగు మద్యం సేవించి ఉండటంతో థియేటర్ సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. అంతే కాకుండా కుటుంబం ముందు కూడా తనని హీనంగా థియేటర్ సిబ్బంది మాట్లాడారని అంటున్నారు. ఆ వివాదం జరిగిన తర్వాత వీరబాగు మినహా ఆయన కుటుంబ సభ్యులను మాత్రమే థియేటర్‌లో సినిమా చూసేందుకు అనుమతించారు. దీంతో మనస్తాపం చెందిన వీరబాగు ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ ఘటన ఆలస్యంగా వచ్చిందని అంటున్నారు.
ఇక ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. అజిత్ హీరోగా నటించిన తునివు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలో విడుదలైంది, ఇదే సినిమాను తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేశారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కగా ఈ సినిమాలో అజిత్‌తో పాటు మలయాళ నటి మంజు వారియర్ యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో నటించింది. ఇక ఈ తునివు సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read: NTR Missed Kaththi Remake: ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి!
Also Read: Singer Mangli Attack: మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook