Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నిన్న హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ఆయన ఫ్యాన్స్.. చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు అజిత్ కి ఏమయింది ఎందుకు హాస్పిటల్లో చేరారు అని సోషల్ మీడియాలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే అజిత్ నిన్న చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అవ్వ సాగిన దగ్గర నుంచి  ఆయనకి సినిమా షూటింగ్‌లో ఏమైనా దెబ్బతగిలి ఉంటుందని, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అంటూ వార్తలు వచ్చాయి. దీంతో అజిత్ అభిమానులు  అంతా ఆందోళనకి గురయ్యారు. ఈ నేపథ్యంలో అజిత్ హెల్త్ అప్‌డేట్ తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అజిత్ సన్నిహితుల నుంచి వస్తోందా సమాచారం ప్రకారం ఆయన అభిమానులు ఎటువంటి టెన్షన్ తీసుకోవలసిన అవసరం లేదని తెలుస్తోంది.  తమ హీరో క్షేమంగా ఉన్నారని అలానే అజిత్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.  అజిత్ హాస్పిటల్ కి కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారు అని సమాచారం. రెగ్యులర్ కార్డియక్, న్యూరో చెకప్‌లు చేయించుకునేందుకే అజిత్ ఆసుపత్రికి వెళ్లారట. అయితే ఆయన హాస్పిటల్ కి వెళ్ళిన వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అభిమానులు రకరకాలుగా ఆలోచించారని.. వారు అనుకున్నట్టు ఆయనకు ఏమీ కాలేదని తెలుస్తోంది.


కాగా ప్రస్తుతం అజిత్ తన తదుపరి యాక్షన్ డ్రామా 'విదా ముయరాచి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. తదుపరి మేజర్ షూటింగ్ షెడ్యూల్ కోసం త్వరలో అజర్‌బైజాన్‌కు అజిత్ వెళ్లనున్నారు. ఈ చిత్రంపై  అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అజిత్ గత సినిమాల లాగానే ఈ చిత్రం కూడా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానంది.


Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter