Miryala Ravinder Reddy Launching his wife's brother: సినీ పరిశ్రమలో వారసత్వం అనేది చాలా కామన్. ఇప్పటికే సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాము అని భావించే వారు తమ బంధువులను, స్నేహితులను సినీ రంగంలోకి తీసుకు రావడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఆ కోవలో చాలా మంది సినీ రంగంలోకి ప్రవేశించి తమ తమ బంధు మిత్రుల సహాయంతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. అందులో కొంతమంది సక్సెస్ సాధించారు, కొంత మంది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే క్రమంలో తాజాగా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మిరియాల రవీందర్ రెడ్డి బామ్మర్ది సినీరంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్దమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టీల్ బిజినెస్ చేస్తూ సినిమాల మీద ఆసక్తితో సినీ నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చారు నల్గొండ జిల్లాకు చెందిన మిర్యాల రవీందర్ రెడ్డి. తొలుత కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన సాహసమే శ్వాసగా సాగిపో అంటూ నాగ చైతన్య హీరోగా ఒక సినిమా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఆయనకు అటు డబ్బు కానీ పేరు కానీ తీసుకు రాలేదు కానీ నిర్మాతగా అనుభవం మాత్రం సంపాదించి పెట్టింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా జయ జానకి నాయక సినిమా రూపొందించారు. 


జయ జానకి నాయక సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించ లేకపోయినా బోయపాటి మార్కుతో ప్రేక్షకులకు అయితే బాగానే రీచ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాక పోవడంతో మంచి కమర్షియల్ హిట్ ఇస్తానని మాట ఇచ్చిన బోయపాటి శ్రీను మాట ఇచ్చిన విధంగానే బాలకృష్ణ హీరోగా అఖండ అనే సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాక రవీందర్ రెడ్డికి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రవీందర్ రెడ్డి ఇప్పుడు తన భార్య సోదరుడిని హీరోగా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.


టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు రవీందర్ రెడ్డి బావమరిది హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాతకోతలు పూర్తయ్యాయని, వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మిర్యాల రవీందర్ రెడ్డి సొంత బ్యానర్ అయిన ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుందా? లేక మరేదైనా నిర్మాణ సంస్థతో ముందుకు వెళతారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల 'నారప్ప' సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!


Also Read:Akhanda Movie Collection: 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ.. రూ.200 కోట్ల కలెక్షన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook