Agent movie first look: అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన నాల్గవ చిత్రమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ (Most Eligible Bachelor) విడుదల కోసం వేచిచూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ సంగతి అలా ఉండగా నేడు అఖిల్ అక్కినేని బర్త్ డే (Akhil Akkineni Birthday)  సందర్భంగా అఖిల్ 5వ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్‌లో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన ఫేమస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ఖరారైంది. అఖిల్ అక్కినేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై సురేందర్ రెడ్డి నిర్మించనున్నారు. 2021 డిసెంబర్ 24న ఏజెంట్ మూవీని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 


Also read : Happy Birthday Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు చిరంజీవి సహా టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్‌డే విషెస్


ఏజెంట్ మూవీ కోసం అఖిల్ గెటప్‌ని పూర్తిగా మార్చేశారు. అఖిల్ మేకోవర్ (Akhil in Agent movie) అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. అఖిల్ హెర్ స్టైల్, గడ్డం లుక్స్ వైజ్ కొత్తగా కనిపించాడు. ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య (Sakshi Vaidya) అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ థమన్ ఏజెంట్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా రగుల్ హెరియన్ ధరుమన్ కెమెరా హ్యాండిల్ చేయనున్నాడు. ఏజెంట్ మూవీ కాంబినేషన్ చూస్తోంటే.. అఖిల్ అక్కినేనికి (Akhil Akkineni) ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుద్దనిపిస్తోంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook