Akhil Akkineni: సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ ఐదో సినిమా
టాలీవుడ్‌లో ఇప్పటివరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఐదో సినిమాను గురించి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Akhil Akkineni 5th Movie: టాలీవుడ్‌లో ఇప్పటివరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఐదో సినిమా గురించి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే అఖిల్ నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది విడుదల కాకముందే అఖిల్ ఐదో చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో చేయనున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ అందించిన కథతో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్‌పై సురేందర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. Also read: Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్
అఖిల్ ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే.. తన నాలుగు, అయిదు చిత్రాలతో అయినా.. భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ప్రయత్నిస్తున్నాడు. చారిత్రాత్మక సైరా సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. అఖిల్ 5వ చిత్రాన్ని సరికొత్తగా సరికొత్తగా భారీ స్థాయిలో ఆవిష్కరించనున్నారు. అయితే ఈ సినమాలో నటించే.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలాఉంటే.. అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ను దసరాకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేత