Akhil Akkineni's Agent Movie Teaser: సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ సినిమాతో హీరోగా మారిన అక్కినేని అఖిల్ సరైన హిట్ సినిమా అందుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఎట్టకేలకు నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో చెప్పుకోదగ్గ హిట్ సినిమా సాధించిన అఖిల్ ఇప్పుడు మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాల భారీగా ఏర్పడ్డాయి. ఇప్పుడు అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ టీజర్ లో అఖిల్ లో ఒక స్టైలిష్ వారియర్ లా కనిపిస్తున్నాడు.  ఒక రక్షణ శాఖ అధికారిగా మమ్ముట్టి కనిపిస్తూ ఉండగా ఆయన అఖిల్ ను ఒక మోస్ట్ నటోరియస్, మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్ అంటూ చెప్పడం కనిపిస్తోంది. మిస్టర్ మాధవ్(మమ్ముట్టి) మనం అతనిని పట్టుకొలేమా అని అడుగుతూ ఉంటే, లేదు అతనిని అంచనా వేయలేం, సాక్ష్యం దొరకదు, ఎలాంటి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ దొరకదు, అతని డెత్ నోట్ ఆల్రెడీ రాసుకున్నాడు అని చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఇక హీరోయిన్ అఖిల్ ను వైల్డ్ సాలే అని అంటూ ఉండడం, దానికి అఖిల్ ఇప్పుడు వైల్డ్ రైడ్ మొదలవుతుందని అంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక అఖిల్ తన ప్రత్యర్ధులను గన్ తో ఎదుర్కొంటున్న తీరు చాలా స్టైలిష్ గా క్రియేట్ చేశారు సురేందర్ రెడ్డి, నిముషం నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తోంది. చివరిలో అఖిల్ తో ఒక బూతు మాట కూడా పలికించాడు దర్శకుడు.


ఈ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే మొట్టమొదటి ఫ్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టీజర్ గనుక చూస్తే ఈ సినిమా ఎంత గ్రాండ్ ఇయర్ గా ఉండబోతోందనే విషయం అర్ధం అయిపోతుంది. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.



Also Read: The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?


Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.